![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -234 లో... ఆనందరావు, భాగ్యం ఇంట్లోకి వచ్చాక.. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు బాబాయ్ అని నర్మద అడుగుతుంది. ఈ ఇల్లు అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళానని ఆనందరావు చెప్తాడు. ఈ రోజు శ్రీవల్లి అక్క పుట్టినరోజు అంటున్నారు.. కనీసం గిఫ్ట్, కేక్ లేకుండా ఎలా సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నారని నర్మద, ప్రేమ డౌట్ మీద డౌట్ అడుగుతారు.
మీరెందుకు అలా అడుగుతున్నారు.. ఒకసారి చెప్పాడు కదా అని శ్రీవల్లి కోప్పడుతుంది. ఆ తర్వాత అందరు శ్రీవల్లి కి బర్త్ డే విషెస్ చెప్తారు. శ్రీవల్లిని నర్మద హగ్ చేసుకొని విషెస్ చెప్పి ఈ రోజు నీ బర్త్ డే కాదని తెలుసు.. రాత్రి దొంగతనానికి వచ్చింది మీ నాన్నే అని తెలుసని శ్రీవల్లి చెవిలో చెప్తుంది నర్మద. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత మీ వాళ్ళు పాపం మావయ్య గారిని దొంగ అనుకొని కొట్టారు.. కొంచెం కూడ బుద్ధి లేదా అని ప్రేమపై దీరజ్ కోప్పడతాడు. ఇద్దరు కాసేపు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని మరి కొట్టుకుంటారు.ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు ఎవరు చూడకముందు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని వెళ్తుంటే నర్మద చూస్తుంది. అది వాళ్ళు చూసి ఇప్పుడు గనక వెళ్తే వాళ్ళు మనల్ని ఫాలో అయి మన భాగోతం మొత్తం బయట పెడతారని కవర్ చేస్తూ వెనక్కి వెళ్తారు. ఇలా కాదు ఇంటి వెనకాల నుండి వెళదామని ఆనందరావు గోడ దూకుతాడు. అది ప్రేమ చూస్తుంది. వాళ్ళు చూసి మళ్ళీ లోపలి వైపు వస్తారు.
అటు వెళ్తే ఆవిడ.. ఇటు వెళ్తే ఈవిడ.. మనం ఏం చెయ్యాలి.. అలా అని ఇంట్లో ఉంటే మనల్ని మాటల్తో టార్చర్ పెడుతున్నారని భాగ్యం, ఆనందరావు అనుకుంటారు.ఆ తర్వాత మొదటి ధాన్యం ఇంటికి వస్తుంది. వేదవతిని రామరాజు పిలిచి కొంచెం తీసుకొని వెళ్లి దేవుడికి పెట్టమని రామరాజు అనగానే మీరే తీసుకొని వెళ్ళండి అని వేదవతి అంటుంది. నువ్వు నా లక్ష్మిదేవివి నిన్ను అపార్థం చేసుకున్న నన్ను క్షమించమని వేదవతితో రామరాజు అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |